
పయనించే సూర్యుడు డిసెంబర్ 1 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సి ణ టి యు కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ డిసెంబర్ 12వ తేదీన జిల్లా కలెక్టరేట్ ఎదురుగా చేయబోతున్న ధర్నాకు సంబంధించిన పాంప్లెట్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హైమావతి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేసిన 42 రోజుల సార్వత్రిక సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలు కాలేదని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో వచ్చేటప్పుడు అంగన్వాడీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. వెంటనే అంగన్వాడి సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 12వ తేదీన ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదురుగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించ బోతున్నామని తెలిపారు. మాకు వెంటనే 26 వేల రూపాయలు కనీస వేతనం ప్రకటించాలని, ప్రతి మినీ సెంటర్లను అప్ గ్రేడ్ చేయాలని మినీ సెంటర్లో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ కు విద్యార్హతల్లో వెసులుబాటు కల్పించి పదోన్నతిని ఇవ్వాలని, అంగన్వాడి వర్కర్స్ కు ప్రభుత్వమే ఫైవ్ జి మొబైల్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ప్రాజెక్టులోని ఎనిమిది సెక్టార్లకు సంబంధించిన నాయకత్వం పాల్గొన్నారు.
