
పయనించే సూర్యుడు డిసెంబర్ 18 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం
సుండుపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ నందు జరిగిన అంగన్వాడి కార్యకర్తల కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ ఫోన్ లను, అలాగే మినీ అంగన్వాడీలను, మేన్ అంగన్వాడీలుగా చేసిన ఆర్డర్ పేపర్లను అంగన్వాడీ కార్యకర్తలకు అందించడం జరిగింది. అనంతరం బేటి బచావో భేటీ పడావో కార్యక్రమంలోనూ, అలాగే బాలివివాహాలు చట్ట రిత్యా నేరం అనే కార్యక్రమంలోనూ, అనంతరం డిసెంబర్ 21వ తేదీన జరిగే పల్స్ పోలియో పోస్టర్లు ఆవిష్కరణ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చప్పిడి రమేష్ నాయుడు గారు, మండల ప్రధాన కార్యదర్శి,టిడిపి నాయకులు పాల్గొనడం జరిగింది.