పయనించే జులై 10 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా చేజర్ల మండలం అంగన్వాడి కార్యకర్తలు. ఆయాలు పాల్గొని ఐసిడిఎస్ లో 50 సంవత్సరాల నుండి పనిచేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్ యాప్ వర్క్ ఎక్కువగా ఉంది గౌరవేతరం తక్కువ పనికి తగ్గ వేతనం 26 వేల రూపాయలు గౌరవేతనం అమలు చేయాలని చేజర్ల తాసిల్దార్ కు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి కనీస వేతనం 26 వేల రూపాయలు మంజూరు చేయాలి హరుకులైన వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి బాల సంజీవని యాప్. పోషణ టేకర్. యాప్ లను రెండిటిని కలిపి ఒకే యాప్ గా కుదించాలి. పని భారం తగ్గించాలి స్కూల్ పిల్లలకు చదువు చెప్పే వీలు కల్పించాలి. సంక్షేమ పథకాలు అమలు చేయుట టి హెచ్ ఆర్ నెలకు ఒకసారి లబ్ధిదారులకు ఇచ్చే విధంగా వీలు కల్పించాలి పై తెలిపిన డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అమలు చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు కోరారు కార్యక్రమంలో మండలంలోని అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు తదితరులు పాల్గొన్నారు