సీఐటీయూ
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగష్టు 11
రామన్నపాలెం పంచాయతీ పరిధిలో రామన్న పాలెం గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన సిఐటియూ చింతూరు మండల ప్రధాన కార్యదర్శి పోడియం లక్ష్మణ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్ లక్ష్యం పేద గర్భిణీలు బాలింతలు చిన్నపిల్లలకు . ఆహారం ఆరోగ్యం విద్య అందించాలి. చింతూరు మండలంలో దాదాపు 23 గ్రామాలలో అంగన్వాడి కేంద్రాలను కూటమి ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని. అంగన్వాడి కేంద్రల లేక పక్కా ఇంట్లో రెంట్ తీసుకుని వర్షానికి పిల్లలు అక్కడున్నటువంటి ఆయాలు వర్కర్లు టీచర్లు.తడుచుకుంటూ పిల్లలకి నాన్న అవస్థలు పడుతూ వాళ్లకి సేవ చేస్తున్నారు. రామన్నపాలెం గ్రామంలో పాత అంగన్వాడి భవనం పూర్తిగా చెడిపోవడంతో. సొంత నిధులతో టీచర్ ఆయా . సొంతంగా ఒక పాకేసుకొని దానికి రేకులు రాడ్లు ఏర్పాటు చేసుకొని పిల్లలకి చదువు చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగనవాడి కేంద్ర లేని గ్రామాల్లో సర్వేలు చేయించి అంగన్వాడీ కేంద్రం లేని గ్రామానికి అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు.