
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి
భైంసా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా *ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ * చేతుల మీదుగా అంగన్వాడీ సిబ్బందికి మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పోషణ అభియాన్ కార్యక్రమం ద్వారా గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారుల ఆరోగ్య స్థితిని మెరుగుపరచడం ప్రధాన లక్ష్యమని తెలిపారు.అంగన్వాడీ సిబ్బందికి అందించిన మొబైల్ ఫోన్ల ద్వారా పోషణ మరియు ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని సమయానికి నమోదు చేసి ప్రభుత్వానికి చేరవేయడం సులభమవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
