పయనించే సూర్యుడు ఆగస్టు 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
అంగన్వాడీ టీచర్స్ కి ఇచ్చిన సెల్ఫోన్ పనిచేయక ప్రభుత్వానికి రిటర్న్ ఇవ్వడం జరిగింది . సోమవారం అనంత సాగరం ప్రాజెక్టు ఆఫీస్ దగ్గర సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి సెల్ ఫోన్లు రిటన్ ఇస్తూ నిరసన తెలియజేశారు. ఈ సెల్ ఫోన్లు మాకు పని చేయట్లేదు వీటి వల్ల పని భారం ఎక్కువైపోయింది ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు కొరకు యాప్లు చేసేదాని కొరకు దాని సంబంధించిన సెల్ ఫోన్లు ఇవ్వాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అనంతసాగరం సిఐటియు మండల కార్యదర్శి షేక్ అన్వర్ భాష, మర్రిపాడు సిఐటియు మండల కార్యదర్శి బత్తల రత్నయ్య మర్రిపాడు మండలం, అనంతసాగరం మండలం అంగన్వాడి సెక్టార్ లీడర్లు సునీత, సుబ్బమ్మ, నాగమణి, మర్రిపాడు,సెక్టార్ లీడర్స్ లక్ష్మీ, పద్మ, అరుణ, సుజాత, జయసుధ, సులోచన, ఆదిలక్ష్మి అంగన్వాడి టీచర్స్ పాల్గొన్నారు.