
గర్భిణులకు శ్రీమంతం మరియు అంగన్వాడి విద్యార్థులకు అక్షరాభ్యాసం అన్నా ప్రసన కార్యక్రమం
సెక్టర్ సూపర్వైజర్ సంధ్య ఆధ్వర్యంలో నిర్వహణ
( పయనించే సూర్యుడు అక్టోబర్ 10 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం బూర్గుల గ్రామంలోని ప్రగతి రూరల్ డెవలప్మెంట్ సెంటర్ లో అన్నారం సెక్టార్ పరిధిలోగల అంగన్వాడీలకు పోషణం మాసం పై అవగాహన సదస్సు సెక్టార్ సూపర్వైజర్ సంధ్య ఆధ్వర్యంలో జరిగింది. దీనిలో భాగంగా సుమారు 20 మంది గర్భిణీలకు శ్రీమంతం చేయడం జరిగింది. అంగన్వాడి విద్యార్థులకు అక్షరాభ్యాసం అన్నప్రాసన కార్యక్రమం మరియు తొట్టెల, జన్మదిన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రగతి సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ మురళీకృష్ణ, ఎడ్యుకేషన్ మేనేజర్ జగదీష్ ప్రగతి జీరోమాల్ న్యూట్రిషన్ టీం శంకర్, నవ్య, బూర్గుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ రాఘవేంద్ర ఏఎన్ఎం అంగన్వాడి టీచర్స్ ఆశా వర్కర్స్ ప్రగతి టీమ్ మెంబర్స్ తులసి, ప్రగతి, కార్తీక్, శ్రీకాంత్ మరి కిషోర్ బాలికలు మహిళలు పాల్గొన్నారు
