
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సోమవారం రోజున అంగన్వాడీలు తలపెట్టిన చలో హైదరాబాద్ ప్రోగ్రాo కు వెళ్లకుండా పోలీసులు అంగన్వాడీలను సోమవారం ఉదయం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు కైరి దేవగంగు మాట్లాడుతూ చలో హైదరాబాద్ ప్రోగ్రాంలో ఎమ్మెల్యేలను, మంత్రులను కలిసి అంగన్వాడి టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందించాలని నిర్ణయించి చలో హైదరాబాద్ ప్రోగ్రామ్ ను తలపెట్టామన్నారు . అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించనట్లయితే ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి చేస్తామని తెలిపారు. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీలకు 18వేల గౌరవ వేతనాన్ని అందించాలని,2026 ఎడ్యుకేషన్ పాలసీని సవరించాలని, అలాగే ఫ్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాలలో కొనసాగించాలనిడిమాండ్ చేసారు.NEP2020 చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తమ సమస్యలను పరిష్కరించాలని ధర్నా నిర్వహించేందుకు వెళ్లే అంగన్వాడీ కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేసి ధర్నాను నిర్వీర్యం చేయడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంగన్వాడి, టీచర్స్,హెల్పర్స్ అధ్యక్షురాలు కైరిదేవగంగు భీమ్గల్ మండలంలో, బి ప్రమీల ఎస్ భోజమ్మ సంగీత అరెస్టు చేయడం జరిగింది
