పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 ఇల్లందు ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
ఇల్లందు ఏప్రిల్ 8వ తేదీ నుండి ఏప్రిల్ 22వ తేదీ వరకు నిర్వహిస్తున్న పోషణ పక్షంలో భాగంగా బుధవారం ఇల్లందు పట్టణంలోని పరదేశి బస్తీ వన్ 16వ వార్డు అంగన్వాడి సెంటర్ నందు టీచర్ ఐసిడిఎస్ సూపర్వైజర్ రోహిణి గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోషకాహారం పై అవగాహన కల్పించారు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు ఏడవ నెల పిల్లలకు అన్న ప్రసన్న వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ అరుణకుమారి సూపర్వైజర్ రోహిణి అంగన్వాడీ టీచర్ వి ధనలక్ష్మి మాధవి ఆయా సీతారత్నం ఏఎన్ఎమ్స్ ఆశా వర్కర్స్ వార్డు ప్రజలు తదితరులు హాజరైనారు