పయనించే సూర్యుడు బాపట్ల మార్చి 9 :- రిపోర్టర్ కే శివకృష్ణ
బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు బాపట్ల డిఎస్పి రామాంజనేయులు ఆధ్వర్యంలో బాపట్ల పట్టణ సీఐ రాంబాబు పర్యవేక్షణలో బాపట్ల చిల్ రోడ్డు సెంటర్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ….. ప్రపంచవ్యాప్తంగా మహిళలు సమానత్వం కోసం మహిళలు చేస్తున్నటువంటి శ్రమకు గుర్తింపు కోసం మహిళలకు రక్షణ భద్రత ఉండాలని 9011లో ప్రారంభించారని అన్నారు.30 సంవత్సరాల క్రితం బీజింగ్ లో ప్రపంచంలోని అన్ని దేశాల అధినేతలు కలసి ఒక సమగ్రమైన ప్రణాళికను రూపొందించారని అన్నారు. సమాజంలో స్త్రీలు పురుషులు ఇద్దరు కలిసి చేసేటటువంటి శ్రమకు తగినటువంటి గుర్తింపు సమాన మైనటువంటి గుర్తింపు ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి సాధించబడుతుందని అన్నారు. అనంతరం మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బాపట్ల డిఎస్పి రామాంజనేయులు, బాపట్ల సర్కిల్ సీఐ హరి కృష్ణ, టౌన్ సిఐ ఆర్ రాంబాబు, బాపట్ల రూరల్ సీఐ శ్రీనివాసరావు,టౌన్ ఎస్సై విజయ్ కుమార్, ఎస్సై చంద్రావతి,రూరల్ ఎస్సై శ్రీనివాసరావు,బాపట్ల కాలేజ్ అఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అధ్యాపకులు డాక్టర్ కె సుబ్బారావు,ఏ పిచ్చయ్య, ఆడే జ్యోత్స్న, డాక్టర్ రాజ కుమారి, భవాని, అరుణ కుమారి, కోమలి బాపట్ల కాలేజ్ ఆఫ్ సైన్స్ కళాశాల విద్యార్థులు, గురుకుల పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.