అంతర5 జాతీయ స్థాయి కరాటే పోటీలలో మరియు ప్రపంచ కరాటే రికార్డు 2025 లో రేవంత్ డిఫెన్స్ స్కూల్ (RDS)విద్యార్థుల ప్రతిభ: పయనించే సూర్యుడు జనవరి 10 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. అంతర్జాతీయ స్థాయి మరియు బోధిస్ వరల్డ్ రికార్డు 2025 ఫిబ్రవరి 08న చెన్నైలో నిర్వహించిన చాంపియన్షిప్ లో తిరువూరు కి చెందిన రేవంత్ డిఫెన్స్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు అని ఆ సమస్త ఫౌండర్ & సీనియర్ కోచ్ మరకాల రేవంత్ కుమార్ గారు తెలిపారు . సబ్ జూనియర్ కట్టా విభాగంలో ఆచంటి దుహిత సాయి ,ఉరవకొండ నెన్సీ , జూనియర్స్ విభాగంలో నోముల శ్రీ శ్రాకృత్యా , మోదుగు వశిష్ఠ, వంగూరి లీలాజై,ప్రథమ స్థానం , సోమయాజుల కాశి విశ్వనాద్ బోదిస్ ప్రపంచ రికార్డు మరియు ఛాంపియన్షిప్ సాధించారు.ఈ సంధర్బంగా తమ తల్లితండ్రులు కోచ్ మరకాల రేవంత్ కుమార్ కి అభినందనలు తెలిపారు గెలుపొందిన విద్యార్థులను అభినందించారు .