పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 12, ఆదోని టౌన్ రిపోర్టర్ గుమ్మల బాలస్వామి : పండితు దీన్ దయాల్ ఉపాధ్యాయస్ఫూర్తితో బిజెపి ప్రతి కార్యకర్త ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా పనిచేయాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు దేశాయి చంద్రన్న, అసెంబ్లీ కో- కన్వీనర్ నాగరాజు గౌడ్లు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు ఎమ్మెల్యే పార్థసారథి ఆదేశాల మేరకు బిజెపి పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ శ్రీరాములు, సదాపురం మండల అధ్యక్షుడు ఉషరాజ్, ఆదోని పట్టణ సెంట్రల్ అధ్యక్షుడు నాగార్జున, జిల్లా అధికార ప్రతినిధి విజయకృష్ణ, శ్రీనివాస్ ఆచారి, కోసిగయ్య, రామకృష్ణ, అంజయ్, రామకృష్ణ, రవిశంకర్, ముని, రాజేష్, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.