ప్రయానించేసూర్యుడున్యూస్(18/08/2025) పెదేముల్ మండల ప్రతినిధి అంజివర్షంలోనూ స్వామివారిని దర్శించుకోవడానికి తరలివచ్చిన భక్తులు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన ఎమ్మెల్సి, ఎమ్మెల్యే లు పెద్దేముల్ మండలంలోని తట్టెపల్లిలో అంబురామేశ్వర స్వామి జాతర మహోత్సవం భక్తుల తో కిటకిటలాడింది, భక్తులు అధికసంఖ్యలో పాల్గొనీ ప్రత్యేక పూజలు చేసారు, అలాగే తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, టీపీసీసీ ప్రచార సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు, స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ తట్టెపల్లి ప్రాంత ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశం, పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపాల్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ అంజయ్య, వైస్ ఎంపీపీ లక్ష్మణ్, నర్సిములు, డీలర్ అంజప్ప, మాజీ ఎంపీటీసి శంకర్ నాయక్, అధికారులు తహసీల్దార్ వెంకటేష్ ప్రసాద్, ఎస్ఐ వేణుకుమార్ స్థానిక ప్రజలు భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు...