పయనించే సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 15:- రిపోర్టర్ (కే శివ కృష్ణ)
ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని బాపట్ల ఆర్డిఓ గ్లోరియా అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జమ్ములపాలెం బ్రిడ్జి వద్దగల అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్గనైజేషన్ సభ్యులు రెయిన్ బో సంస్థ అధినేత చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ సరఫరా కార్యక్రమాన్ని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు, ఆర్డిఓ గ్లోరియా, తాహసిల్దార్ సలీమా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీవో గ్లోరియా మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సభ్యులు చంద్రశేఖర్ మజ్జిగ సరఫరా చేయడం సంతోష నియమన్నారు. స్నేహితులందరూ కలిసికట్టుగా ఆపదలో ఉన్న పేదలను ఆదుకునేందుకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు అండగా నిలవడం గర్వించదగ్గ విషయమని రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు పేదలకు చేదోడుగా నిలవాలని ఆకాంక్షించారు. పంపిణీ కార్యక్రమంలో తహసిల్దార్ సలీమా, ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షులు వేజండ్ల శ్రీనివాసరావు, కోశాధికారి జోగి సువర్ణ రాజు, నల్లపాటి కిషోర్, విన్నకోట శ్రీనివాసరావు, పులిపాటి అమ్మయ్య, నరాల శెట్టి నాగరాజు, ఓటికుండల లక్ష్మణరావు, బేగ్ తదితరులు పాల్గొన్నారు