అంబేడ్కర్ ఆశయ సాధన కోసం అందరం కృషి చేయాలి…
టిపిటిఎల్ఏ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు..
టి పి టి ఎల్ ఎ అధ్యక్షుడు రహమాన్..
పయనించే సూర్యడు // ఏప్రిల్ // 14 // కుమార్ యాదవ్ // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్..
అంబేడ్కర్ జయంతి సందర్భంగా జమ్మికుంట పట్టణంలో , తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రహమాన్ ఆధ్వర్యంలో, యూనియన్ సభ్యులతో కలిసి స్థానిక స్రవంతి జూనియర్ కళాశాలలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి , ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు రహమాన్ మాట్లాడుతూ… అంబేడ్కర్ ఎన్నో ఉన్నత పదవులను సైతం, తునప్రాయంగా త్యజించి తన జీవితాన్ని అంకితం చేస్తూ ప్రతి పౌరునికి ప్రాథమిక హక్కులు లభించడానికి, చట్టం ముందు అందరూ సమానులేనని చాటడానికి, అస్పృశ్యత నేరం అన్న అంశాన్ని చట్టబద్ధం చేయడానికి ఆయన చేసిన కృషి మూల కారణమని అన్నారు. భారతదేశ ప్రథమ న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ రచన సంఘ అధ్యక్షునిగా, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు. తరతరాలుగా మతం పేరుతో, బూజు పట్టిన భావాలతో తోటి వారిని ముఖ్యంగా మహిళలను విచక్షణకు, అవమానాలకు, అన్యాయానికి, అత్యాచారాలకు గురి చేస్తున్న వ్యవస్థపై, పోరాటంలో భాగంగా ఆయన హిందూ కోడ్ బిల్లును రూపొందించారన్నారు.అంబేడ్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పరిరక్షణ కోసం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు చల్లూరి సాధయ్య, పోలు రాజశేఖర్, ఉపాధ్యక్షులు ధబ్బెట సతీష్, అన్నబోయిన రాజేందర్, శ్రీధర్ రెడ్డి, హెచ్పిసి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, చుక్కా భాస్కర్, మీడియా కన్వీనర్ అంకూస్,ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఈదునూరి రాజేష్,మంజూష, సతీష్ కుమార్ ఇతర సభ్యులు పాల్గొన్నారు..