పయనించే సూర్యుడు న్యూస్ జూలై 18(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
మండల కేంద్రమైన యాడికి లో శ్రీఅంభ భవాని దేవస్థానంలో ఆషాడ మాస నాలుగవ శుక్రవారం సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఉదయాన్నే నూతన వస్త్రాలు ప్రత్యేకంగా తెప్పించిన పూలు పూలమాలలు సమర్పించి పంచామృతాభిషేకం నిర్వహించారు. పేటలో ఉన్న రామాలయం నుండి రకరకాల పిండి వంటలతో పలహారాలు ఏర్పాటు చేసి ఊరేగింపుగా శోభాయాత్ర చేయడం జరిగింది అమ్మ భవానీ మాతకు నైవేద్యం ఏర్పాటు చేసి భక్తి పాటలతో భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు జై భవాని జై జై భవాని అంటూ నినాదాలతో చుట్టూ ఆలయ ప్రాంతమంతా మారుమోగింది. ఈ కార్యక్రమం అంతా అమ్మ భవాని ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు