రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరాముడు యాదవ్.
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 5 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండల పరిధిలోని చందన గ్రామంలో అకాలంగా కురిసిన గాలివాన కి అరటి పంట నష్టపోయిన రైతుల పంట పొలాలను శనివారం రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకట రాముడు యాదవ్ ఆధ్వర్యంలో రైతులు, రైతు సంఘం నాయకులతో కలిసి తీవ్రంగా నష్టపోయిన రైతుల పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటరాముడు యాదవ్ మాట్లాడుతూ చందన గ్రామానికి చెందిన రైతు రంగప్ప నాయుడు తన 7 ఎకరాలు పొలంలో అరటి పంట సాగు చేయడంతో చేతి కందిన అరటిపంట అకాల గాలివానకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందన్నారు. దాదాపు 10 లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్లు రైతు రంగప్ప నాయుడు వాపోయాడు అదేవిధంగా రైతులు సూర్యనారాయణ రెడ్డి, సత్యం రెడ్డి, తో పాటు మిగతా రైతుల కూడా అకాల గాలివానకి అరటిపంట తీవ్రంగా నష్టపోయినట్లు రైతులు వాపోయారు. మండల వ్యాప్తంగా అరట పంట తో పాటు, తీవ్రంగా పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వము ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరాముడు యాదవ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు ఓబిరెడ్డి, ఆదినారాయణ యాదవ్, రైతు సంఘం సీనియర్ నాయకులు శ్రీరాములు సిపిఐ సీనియర్ నాయకులు గరిడీ శివన్న , బండారు రాఘవ పట్టణ కార్యదర్శి చిన్న కుల్లాయి రెడ్డి, చందన సిపిఐ శాఖ కార్యదర్శి సూరప్ప, వెంకటస్వామి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు