ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న దృశ్యం..
రుద్రూర్, మే 13 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో మంగళవారం రుద్రూర్ పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. పోలీసుల ఫుట్ పెట్రోలింగ్ ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ కావాలనే ఉదేశ్యంతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు రుద్రూర్ ఎస్సై పి.సాయన్న తెలిపారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, గంజాయి మత్తు పదార్థాలు వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సాయన్న సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సాయన్న, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.