పయనించే సూర్యుడు న్యూస్ మోతె మండల ప్రతినిధి బి.వెంకన్న జనవరి 29 వార్త విశ్లేషణ
కుటుంబ దృవీకరణలో ఉన్న సభ్యులకు ఎగణామం ఒక్కరికె భూ రిజిస్ట్రేషన్ తహశీల్దార్ సంఘమిత్ర కీలక పాత్ర రెండవ భార్య పులమ్మ ఆధారాలతో ఆరోపణ తహశీల్దార్ పై చర్యలు తీసుకోవాలని వారం రోజులుగా డిమాండ్. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన మట్టిపల్లి వెంకటాచలం పేరుతో సూర్యాపేట జిల్లా మోతె మండలం నమవారం గ్రామ రెవెన్యూలో 7 ఎకరాల 10 గంటల భూమి కలదు.అతనికి ఇద్దరు భార్యలు ముగ్గురు పిల్లలు ఉన్నారు.మొదటి భార్యకు ముగ్గురు ఆడపిల్లలు కాగా చిన్న బిడ్డ చనిపోయిది రెండవ భార్యకు ఒక కుమారుడు ఉన్నాడు.వెంకటాచలం కరోనా సమయంలో కోవిడ్ బారినపడి మృతి చెందాడు.అతను బ్రతికుండగానే ఇద్దరు కూతుర్లకు కట్నం కింద కొంత భూమి రాసి ఇచ్చాడు అప్పటినుండే రెండవ భార్య భూమి విషయంలో ఘర్షణ పడుతూ వస్తోంది.ఈ భూ వివాదం నడుస్తుండగా నే పెద్దల సమక్షంలో 7 ఎకరాల 10 గుంటల భూమిలో 1.35 గుంటల భూమిని రెండవ భార్య పులమ్మకు రిజిస్ట్రేషన్ చేసే విధంగా నిర్ణయించారు.కానీ అక్రమంగా మోతె తహశీల్దార్ కుటుంబ ధ్రువీకరణ పత్రాన్ని పాటించకుండా.ఇద్దరు భార్యలు ఉండగా మొదటి భార్య పిల్లలకే మొత్తం భూమి ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని రెండవ భార్య ఎమ్మార్వో సంఘమిత్రను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది అయినా సదరు ఎమ్మార్వో పట్టించుకోకపోవడంతో ఆమెపై చర్యలు తీసుకొని తనకు నాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దివ్యాంగ మహిళ అయిన రెండవ భార్య పులమ్మ గత వారం రోజుల క్రితం తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసనకు దిగినప్పటికి స్పందించకపోవడంతో ఆర్డీవోకి,జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాలు అందజేసింది విచారణ పేరుతో రెండు రోజులుగా కాలయాపన చేస్తున్నారు తప్పితే చర్యలు తీసుకోవట్లేదని బాధితురాలు పులమ్మ వికలాంగుల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.