
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి
తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ, ప్రజల బతుకులను ఆగం చేస్తూ, భావితరాలను భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అరాచక, కమీషన్ల పాలనను నిలదీస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రాంచందర్ రావు నేతృత్వంలో "అసెంబ్లీ ముట్టడి" కార్యక్రమం. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను వంచించిన కాంగ్రెస్ మెడలు వంచుదాం..సోయి తప్పి పేదల ఉసురు పోసుకుంటున్న రేవంత్ సర్కార్కు సుర్కులు పెడదాం…ఛలో అసెంబ్లీ - భైంసా పట్టణం బీజేపీ ప్రెసిడెంట్ రావుల రాము, జిల్లా కార్యదర్శి తాడేవార్ సాయినాథ్ లను ని ఈ రోజు తెల్లవారుజామున 4-00 గంటలకు ముందస్తు అరెస్ట్ చేసిన - భైంసా టౌన్ పోలీసులు *అమలు కాని హామీలిచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలకు నిరసనగా తెలంగాణ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నేటి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంకు వెళ్లకుండా భైంసా టౌన్ అధ్యక్షుడు రావుల రాము , బీజేపీ జిల్లా కార్యదర్శి , తాడేవార్ సాయినాథ్ నాయకులను పోలీసులతో ముందస్తు అరెస్టులు చేపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.