పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 23
చింతూరు గ్రామపంచాయతీ పరిధిలో ఎర్రంపేట గ్రామం నందు అక్రమంగా బహులంతస్తు బిల్డింగు కడుతున్నారని ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో చింతూరు ఐటిడిఏ నందు 13/10/2025 నాడు ఫిర్యాదు చేయడం జరిగిందని. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో అక్రమ కట్టడం నిర్మాణం కొనసాగుతూనే ఉందని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండిపడ్డారు. ఏజెన్సీ చట్టానికి విరుద్ధంగా నాన్ ట్రైబల్స్ అక్రమాలు కడుతున్నారని ఒకపక్క బహిరంగ ప్రకటనలు చేస్తూనే మరోపక్క లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్న సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోతే ఏమనుకోవాలని ఆయన అనుమానాన్ని వ్యక్తం పరిచారు. ఒకపక్క అక్రమ కట్టడాలు తొలగించాలంటూ ఆదేశాలు ఉన్నప్పటికీ మరోపక్క భూ అక్రమాలు అక్రమ కట్టడాలు పెరిగిపోతున్న పంచాయతీ రెవెన్యూ అధికారులు తెలిసి కూడా చూసి చూడనట్టు ఉంటున్నారంటే సంబంధిత అధికారులకు ముడుపులు ఏ స్థాయిలో అందాయో అర్థం అవుతుందని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ఎర్రంపేటలోని పాత పోస్ట్ ఆఫీస్ ముందు లైన్లో అక్రమంగా నిర్వహిస్తున్న బహుళ అంత బిల్డింగ్ ని తక్షణమే కూల్చివేయకపోతే సంబంధిత అధికారులపై మరియు నిర్మిస్తున్న నాన్ ట్రైబల్స్ పై 1/70 చట్టంలోని సవరించిన అంశం 1978 వచ్చిన సెక్షన్ 3(5)ప్రకారం క్రిమినల్ కేసులు వెయ్యాలని హైకోర్టులో ఆపిల్ చేస్తామని ఆయన హెచ్చరించారు.