పయనించే సూర్యుడు ఆగస్టు 12 శర్మాస్ వలి మండల రిపోర్టరు యాడికి
యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో వేములపాడు లో నివాసం ఉంటున్న చుక్కలూరు పవన్ కుమార్ రెడ్డి, భార్య భాగ్యలక్ష్మి వారి కుమారుడు రంజిత్ కుమార్ రెడ్డి 21వ పుట్టినరోజు శుభ సందర్భంగా ఆశ్రమంలోని నిరాశ్రయులకు అన్నదానం ఏర్పాటు చేశారు.ఇందులో భాగంగా కుమార్తె సోహరిత, పెదనాన్న రామానంద రెడ్డి,చిన్న పెదనాన్న పురుషోత్తంరెడ్డి మరియు కుమారులు,కుమార్తెలు పాల్గొన్నారు.కుటుంబముతో కలిసి అగాపే ఆశ్రమంలో ఉంటున్న వారందరికీ భోజనాలు వడ్డించారు.ఇందు నిమిత్తమై ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.