పయనించే సూర్యుడు ఆగస్టు 19 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో పెళ్లిరోజు సందర్భంగా భోజనాలు సిద్ధపరిచారు.సిద్ధపరిచినవారు కడప జిల్లా, మైదుకూరు మండలం, పెద్ది శెట్టి పల్లి లో నివాసముంటున్న బలగని నాగప్రసాద్ భార్య సావిత్రి వీరు తమ 3వ పెళ్ళి రోజు శుభ సందర్భంగా ఆశ్రమంలో ఉంటున్న పెద్దలకు అన్నదానం చేసి, వారి ఆశీస్సులు తీసుకోవడం మంచిదని భావించి,మంచి విందు ఏర్పాటు చేయించి,వాటితో పాటు స్వీట్లు, పండ్లు పంచిపెట్టి కేక్ కటింగ్ కూడా చేశారు.ఆ తర్వాత ఆశ్రమంలోని పెద్దలందరికీ భోజనాలు వడ్డించారు.ఇంటి నిమిత్తమై ఆశ్రమఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా వారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసి కృతజ్ఞతలు తెలిపారు.