పయనించే సూర్యుడు సెప్టెంబర్ 24 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో బండారు చంద్రశేఖర్, భార్య కీ"శేనాగేంద్రమ్మ వారి కుమారుడు అశోక్ కుమార్, కోడలు రూప శ్రీ, మనవరాలు ఓంకారేశ్వరి వీరి కుటుంబము అగాపే ఆశ్రమంలోని నిరాశ్రయులకు అన్నదానం ఏర్పాటు చేశారు.ఎంతోమంది ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నారు.మేము కూడా మా వంతుగా ఆశ్రమంలో ఉన్న వారికి, మా చేతుల మీదుగా ఏదైనా చేయాలనుకున్నారు.అనుకున్నట్టుగానే భోజనాలు ఏర్పాటు చేయించి కుటుంబమంతా కలిసి, వారి చేతుల మీదగా ఆశ్రమంలో ఉన్న వారందరికీ భోజనాలు వడ్డించారు.అశోక్ పెద్దనాన్న రామచంద్రుడు,అక్కలు చౌడమ్మ,జయలక్ష్మి బావలు హరిప్రసాద్,రంగస్వామి మామ పుల్లయ్య, అత్త పద్మావతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఇందు నిమిత్తమై ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.