పయనించే సూర్యుడు న్యూస్ 13 ఫిబ్రవరి (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో కడప జిల్లా వేంపల్లి వాస్తవ్యులు వేల్పుల శేఖర్,భార్య ముని కీర్తి వారి పెళ్లి రోజు శుభ సందర్భంగా ఆశ్రమంలోని వారికి అన్నదానం చేయాలను కున్నారు. కుటుంబంతో కలిసి అగాపే ఆశ్రమానికి వచ్చి ఆశ్రమంలో ఉంటున్న అందరికీ భోజనాలు సిద్ధపరిచి అన్నదానం చేశారు.కూతురు త్రివిధ, అమ్మ వెంకటలక్ష్మమ్మ, నాన్న రామాంజనేయులు, అత్త విజయలక్ష్మి, మామ ముని ప్రసాద్,బావ మునీంద్ర, కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు పాల్గొన్నారు.ఇందు నిమిత్తమై ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్తూ వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.