పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 24(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో భీమిరెడ్డి ప్రియాంక రెడ్డి 32వ పుట్టినరోజు శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఉద్యోగరీత్యా ప్రియాంక ,భర్త భీమిరెడ్డి విజయ్ కాంత్ రెడ్డి అమెరికాలో నివాసం ఉంటున్నారు.ఇందు నిమిత్తమై అనంతపురంలో నివాసం ఉంటున్న తన అత్తా చంద్రకళ, మామ భీమిరెడ్డి ఎర్ర నాగిరెడ్డి వారి కోడలు ప్రియాంక ఇక్కడికి రాలేక పోయినప్పటికీ పుట్టినరోజు వేడుకను చేయాలని ఎంతో ప్రేమతో కోరుకున్నారు.కోరుకున్నట్టుగానే మంచి విందు ఏర్పాటు చేయించి యాడికి లోని అగాపే ఆశ్రమంలోని నిరాశ్రయులకు అన్నదానం చేశారు. కుటుంబ సభ్యులు మరిది గిరీష్ రెడ్డి, నాయనమ్మ ఈశ్వరమ్మ, బంధుమిత్రులు పాల్గొన్నారు.ఇందు నిమిత్తమై ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసి వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.