పయనించే సూర్యుడు న్యూస్ జూలై 22 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండలం కమలపాడు రోడ్డు రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో అన్నదానం చేశారు. ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్ మాట్లాడుతూ బెంగళూరు వాస్తవ్యులు యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా అగాపే ఆశ్రమం గురించి చూసి విని తెలుసుకొని, ఆశ్రమాన్ని ప్రేమించి అందులో ఉంటున్న నిరాశ్రయులకు అన్నదానం ఏర్పాటు చేయాలని ఆశతో, యాడికి మండలానికి వచ్చి ఆశ్రమాన్ని సందర్శించి ఆశ్రమంలోని వారికి భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ లారెన్స్ ,పాస్టర్ జాన్ రవి, పాస్టర్ సీమోను, పాస్టర్ ప్రకాష్ పాల్గొన్నారు.ఇందు నిమిత్తమై ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్ ఆశ్రమంలోని వారంతా వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.