పయనించే సూర్యుడు న్యూస్ జూలై (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండలం కమలపాడు రోడ్డు రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో జానపాటి విజయలక్ష్మి మొదటి వర్ధంతి సందర్భంగా ఆదోనిలో నివాసముంటున్న ఆమె కూతురు సింధూల అనురాధ, అల్లుడు సింధూల వెంకటేష్, మనవడు నవీన్ కుమార్ వీరి కుటుంబము జానపాటి విజయలక్ష్మి ఆత్మకు శాంతి కలగాలని, ఆమె పేరు మీద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అగాపే ఆశ్రమంలోని నిరాశ్రయులతో పాటు, అగాపే చర్చ్ లోని విశ్వాసులకు కూడా మంచి విందు ఏర్పాటు చేయించారు. ఇందు నిమిత్తమై ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.