
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 27(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో ఫౌండర్ బత్తల ప్రసాద్ గారు అన్నదానం చేశారు.కీ"శే"బత్తల సీమోన్ తండ్రి గారి 8వ వర్ధంతి ని జ్ఞాపకము చేసుకుంటూ ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్ గారు భార్య యెమిమా కూతురు క్యాథలిన్ రోని, కొడుకు కెనిత్ ఆశ్రమంలోని నిరాశ్రయులందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేసి కుటుంబం అంతా కలిసి భోజనాలు వడ్డించారు. వారి బంధుమిత్రులు, సన్నిహితులు కూడా పాల్గొన్నారు. ఆశ్రమంలోని వారంతా మాకు ఆశ్రయమిచ్చి ,ఎంతగానో ఆదరిస్తూ ,పోషిస్తున్న మా అయ్యగారిని కన్న ఆ తండ్రిగారికి మా నివాళులు అర్పిస్తున్నాము. మాకు మంచి విందు ఏర్పాటు చేసినందుకు మా ఫౌండర్ గారికి మా అభినందనలు అని సంతోష వ్యక్తం చేశారు.
