పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్21(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో బాపనపల్లెలో నివాసం ఉంటున్న బందెల నరసింహుడు భార్య సుమ వారి కుమార్తె రూతు 2 వ పుట్టినరోజు శుభ సందర్భముగా అగాపే ఆశ్రమంలోని నిరాశ్రయులకు బ్రెడ్లు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే అన్నదానం కూడా చేశారు.నానమ్మ నరసమ్మ, తాతయ్య ఓబులేసు,అమ్మమ్మ మార్తమ్మ, తాతయ్య కులశేఖరు, మామ రవి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఇందు నిమిత్తమై ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా ఆ చిన్న బిడ్డకి శుభాకాంక్షలు తెలియజేసి వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.