
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 6(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండలం కమలపాడు రోడ్డు రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో గత కొంతకాలం నుంచి ఫ్రిడ్జ్ కావాలని ఎదురు చూస్తున్నారు.అలాంటి సమయంలో దాతలు ముందుకు వచ్చి 35 వేల రూపాయలు ఖర్చుపెట్టి ఫ్రిడ్జ్ ఇవ్వడం జరిగింది.ఫౌండర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ అగాపే ఆశ్రమంలో కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, పెరుగు నిల్వ చేసుకోవడానికి ఫ్రిజ్ లేక ఎన్నోసార్లు పాడవడం ద్వారా ఇబ్బంది పడ్డాము.మేము తేవాలని ఎన్నోసార్లు అనుకున్నాం. కానీ ఆర్థికంగా ఇబ్బందిగా ఉండటం వలన తేలేకపోయాం. ఇలాంటి తరుణంలో దాతలు ముందుకు వచ్చి ఈ విధంగా మా ఆశ్రమానికి ఫ్రిడ్జ్ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది.ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు మా అభినందనలు తెలుపుకుంటున్నాము.ఆశ్రమంలో ఉన్నవారు కూడా సంతోషించి వారికి కృతజ్ఞతలు తెలిపారు.
