పయనించు సూర్యుడు న్యూస్ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ ఇంచార్జ్ వడ్ల శ్రీనివాస్ 28 తేదీ మార్చి :భారత ప్రభుత్వ త్రివిధ దళాలలో సైనిక సేవలు చేయుటకు అగ్నివీర్ కు ఎంపికైన బిజ్వార్ గ్రామ యువకుడు యం డి ఇమామ్ పాషా ను మరియు ఆయన తండ్రి మహబూబ్ అలి ని ధర్మ జాగరణ సమితి జిల్లా నాయకులు దోరోళ్ళ కృష్ణయ్య,జల సాధన సమితి జిల్లా కో కన్వీనర్ హెచ్.నర్సింహా,గ్రామస్తులు రాఘవేంద్ర,మహేందర్,చిన్న నర్సింహా,రమేష్, ముభారక్,అన్వార్ తదితరులు శాలువా తో సన్మానం చేసి మిఠాయి తినిపించి అభినందనలు తెలిపారు.దేశసేవ చేయుటకు బిజ్వార్ యువకులు ముందుకు రావడం గర్వకారణం అని తెలిపారు.గ్రామంలోని యువత వారిని ఆదర్శం తీసుకొని ప్రతి ఒక్కరూ దేశసేవ చేయుటకు ముందుకు రావాలని తెలిపారు. అగ్నివీర్ లో సేవ చేస్తూ భవిష్యత్తులో ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని అన్నారు.