పయనించే సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 18:- రిపోర్టర్ (కే. శివకృష్ణ)
అగ్నిమాపక వారోత్సవాలు- 2025 లో బాగంగా నాలుగోవ రోజు అనగా గురువారం బాపట్ల పట్టణములోని బాపట్ల పబ్లిక్ స్కూల్ నందు బాపట్ల అగ్నిమాపక కేంద్రం వారు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఫైర్ ఆఫీసర్ వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ…స్కూల్ పిల్లలకు మరియు అధ్యాపక సిబ్బందికి అగ్ని ప్రమాదాల గురించి మరియు నివారణ పద్ధతుల గురించి అవగాహన కల్పించడం జరిగిందని, మరియూ వాటర్ డెమో, ఫోమ్ డెమో, ప్రకృతి విపత్తుల వలన జరిగే ప్రమాదముల గురించి వివరించి, వారికి డెమో చూపించి పైర్ ఎక్సటింగుషర్స్ ఉపయోగించి అగ్ని ప్రమాదములు నివారించే పద్ధతులు వారికి పూర్తిగా అవగాహన కల్పించామని ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వరావు తెలిపారు. ఈ కార్యక్రమం లో అసిస్టింట్ ఫైర్ ఆఫీసర్ మునాఫ్, ఫైర్ సిబ్బంది మరియు బాపట్ల పబ్లిక్ స్కూల్ ప్రధానోపాధ్యాయులురఘురామ్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.