టిడిపి సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు
_పయనించే సూర్యుడు, జనవరి 29, కర్నూలు జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్
_
ఆదోని పట్టణంలో టిడిపి ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు మీనాక్షి ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడ, జల్గర్ గేరి లో నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన రెండు గుడిసెల, అలానే పక్కన ఉన్నట్టు ఇంటిలో కూడా పూర్తిగా బట్టలు కాలిపోయిన కుటుంబ సభ్యులను పరమర్శించడం జరిగింది. టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అగ్ని ప్రమాదం జరిగినటువంటి స్థలానికి వచ్చి వారిని పరామర్శించడం జరిగింది. ఒక కుటుంబానికి 5000 ప్రకారం రెండు కుటుంబాలకు కలిపి 10000 ఇవ్వడం జరిగింది. అలానే ఇంటి పక్కనే ఇంటిలో ఉండేవి బట్టలన్నీ కాలిపోయిన కుటుంబం కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది. వారితో మాట్లాడుతూ మీకు మాజీ ఎమ్మెల్యే కొంక మీనాక్షి నాయుడు తో మాట్లాడి ప్రభుత్వ సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. కాలిపోయిన గుడిసెలో కుటుంబ సభ్యులు వారి ఇంట్లో పెళ్లి ఉందని చెప్పారు. ఉమాపతిస్పందిస్తూ పెళ్లి కుదిరిన వెంటనే తనకు తెలియజేయమని తన వంతు సహకారం అందిస్తానని చెప్పడం జరిగింది.
ఇందులో భాగంగా టిడిపి నాయకులుమారుతిరావు సాకరే, టిడిపి టౌన్ సెక్రెటరీ సాకర ఈరన్న, బినిగిరి తిమ్మప్ప, వార్డు ఇంచార్జ్ మాజీ కౌన్సిలర్ సాకరే లక్ష్మణ్, దత్త రఘునాథ్, పొందే రాజ్ కుమార్, అశోక్, జాల్గార గిరి రవి, మరియు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు రంగస్వామి నాయుడు, రామస్వామి, రంగన్న, అప్సర్ భాష, మా భాష, సుబ్బు,జగదీష్, గిడ్డయ్య, శివ, వీరేంద్ర, పాల్గొన్నారు.