
పయనించే సూర్యుడు జనవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ
పలు దేవాలయాల్లో వీరన్న చౌదరి ప్రత్యేక పూజలు..
కేకులు కట్ చేసి పుష్పగుచ్చాలతో అభిమానుల సంబరాలు..
. రాజానగరం నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి జన్మదినోత్సవ వేడుకలు శుక్ర, శనివారాల్లో అట్టహాసంగా నిర్వహించారు. వీరన్న చౌదరి గత 40 ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంత రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు..ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని శుక్రవారం రాజమహేంద్రవరంలోని ప్రియాంక గార్డెన్స్ వద్ద వీరన్న చౌదరి కార్యాలయం వద్ద బిజెపి, టిడిపి, జనసేన పార్టీ నాయకులు వీరన్న చౌదరి అభిమానులు, శ్రేయోభిలాషులు కేకులు కట్ చేసి సంబరాలు నిర్వహించారు. తదుపరి శనివారం వీరన్న చౌదరి కోరుకొండ, సీతానగరం మండలాల్లో పలు దేవాయాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అలాగే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, కూటమి నాయకులు వీరన్న చౌదరిని కలిసి శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు..
