
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం క్రాప గ్రామంలో వేడుకల్లో పాల్గొని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మరణించిన అడపా మల్లేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. గుంటూరు జిల్లా జనసేన ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు అడపా శ్రీనివాసరావు, అడపా ట్రస్ట్ అధ్యక్షులు శివయ్య, సెక్రటరీ కళ్యాణ్, ఉపాధ్యక్షులు బాబులు, గుడివాడకు చెందిన అడపా ప్రభు, గుండుగొలనుకు చెందిన అడపా గణేష్, కడప వీరస్వామి పాల్గొని కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. అనంతరం బాధిత కుటుంబానికి పది వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.