పయనం చే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే జి జి ఆర్. తెలంగాణ నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పరిధిలో ఎక్కడ చూసినా భీంగల్ పరిధిలో ఇసుక డంపులు పకృతి సంపద అయిన ఇసుకను కొల్లగొడుతూ ఇసుక మాఫియా సొమ్ము చేసుకుంటున్నావైనమిది. వాగు పరిసర ప్రాంతాలైన ఇక్కడ కొంతమంది అక్రమంగా ధైర్యంగా అలవాటు పడి కొందరు పగలు రాత్రి తేడా లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారు. భీంగల్ మండలం లోని బడా భీంగల్, భీంగల్ చుట్టుపక్క గ్రామాలు లో టన్నులకొద్దీ ఇసుకను తరలిస్తూ రూపాయలు లక్షలు వెనకేసుకుంటున్నారు. గ్రామాలలో సంబంధిత ట్రాక్టర్ ఓనర్లు ఇసుక దందా జోరుగా నడిపిస్తూ ప్రభుత్వ నిబంధనలను తుంగల్లో తొక్కుతున్నారేమో అని విమర్శలు ఉన్నాయి. వాగులో నుంచి ప్రతిరోజు ఇసుక రవాణా జరుగుతున్న అధికారులు సైతం అటువైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక పాయింట్ లేనప్పటికీ భారీగా ఇసుకతోడిస్తూ అక్రమంగా రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పల్లెలోని వినియోగదారులు అవసరమే అవకాశం గా మార్చుకొని అక్రమార్కులు అందిన కాడికి దోచుకుంటున్నారు. ఒక ట్రాక్టర్ లోడుకు దొడ్డు ఇసుక రూ.5వేల నుంచి రూ.6 వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సన్న ఇసుక కావాలంటే కప్పల వారి నుంచి ఎడ్ల బండితో అక్రమంగా విక్రయిస్తూ ఇసుక ఇంటి ఆవిరంలో డంపు చేస్తున్నారు అక్రమంగా. చుట్టుపక్క గ్రామాలకు రాత్రి పగలు తేడా లేకుండా డాక్టర్లు లోడ్ చేసి పంపిస్తున్నారు ఒక్కొక్క లోడుకు రూ.6వేల నుంచి రూ.7 వేల వరకు విక్రయిస్తున్నారు ఇంత దర్జాగా అక్రమార్కులు వాగుల నుంచి ఇసుక సరఫరా చేస్తున్నారా అంటే ఇదంతా అధికారులకు తెలియకుండానే జరుగుతుందా? అని అవమానాలు వ్యక్తం చేస్తున్నాయి ఇసుక అక్రమ రవాణా అధికారులైన తెర లేపుతున్నారేమోనని గ్రామంలో పలువురు ఆరోపణలు చేస్తున్నారు. వాగుల్లో ఇసుక మాఫియా ఒక వరంగా మారిందాని పట్టపగలు ఇసుకను ఇష్ట రాజ్యాంగా తరలిస్తుండడం గమనార్ధం. దీనిపై సంబంధిత రెవెన్యూ మైనింగ్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం మాత్రం శూన్యంగా మారిపోయిందని వాక్కు పరిసరాల ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ మైనింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో అక్రమార్కులు అదే అదనంగా తీసుకొని ఇసుక రవాణా జోరుగా సాగిస్తున్నారు. ఇప్పటికైనా దీనిపై స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.