
ప య నించే సూర్యుడు మార్చ్ 25 అమలాపురం :
అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ
చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన చిక్కం సుధను & డైరెక్టర్ సుంకర సాయి ని బీజేపీ నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా ఆమెను కలసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు యాళ్ల దొరబాబు, మోకా వెంకట సుబ్బారావు, గనిశెట్టి అరవింద్, గణిశెట్టి రోహిణి కుమార్ తదితరులు పాల్గొన్నాడ. నాయకులు మాట్లాడుతూ రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం అట్మా ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. చిక్కం సుధ నాయకత్వంలో రైతులకు మెరుగైన సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొని తమ మద్దతు తెలిపారు.