
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
నూతన ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాల కల్పనకు రూ.5.31 కోట్లు
ఆసుపత్రిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
షాద్ నగర్ వంద పడకల ఆసుపత్రిని అత్యధిక సదుపాయాలతో, పూర్తిస్థాయి వసతులతో నిర్మాణం చేపట్టబోతున్నామని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రకటించారు. లింగారెడ్డిగూడెం శివారులోని అలీసాబ్ గూడ వద్ద నిర్మిస్తున్న నూతన ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాల కల్పన కోసం అదనంగా రూ.5.31 కోట్లు ప్రభుత్వం ఇటీవలే మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం ఎమ్మెల్యే శంకర్ స్థానిక సర్పంచ్ mc రాజు, ఉప సర్పంచ్ అశోక్ ఆధ్వర్యంలో తన చేతులో మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ మంజూరైన నిధుల ద్వారా ఆసుపత్రిలో ప్రహరీ నిర్మాణం, సీసీ రోడ్ల ఏర్పాటు, మెడికల్ ల్యాండ్రీ, మోడ్రన్ కిచెన్ షెడ్, పార్కింగ్ షెడ్, మార్చురీ భవనం, బయో వేస్టేజ్ నిర్వహణ లను చేపడుతామని వివరించారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి అత్యాధునిక వైద్యం ఇక్కడ అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే నిర్మాణం పనులు పూర్తి చేసి ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి కార్యనిర్వహణ అధికారి డాక్టర్ విష్ణువర్ధన్, మండల పార్టీ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, మాజీ ఎంపీపీ చల్లా వెంకటేశ్వర రెడ్డి, లింగారెడ్డి గూడా గ్రామ సర్పంచ్ ఎంసి ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ ఎర్రోళ్ల అశోక్, గ్రామస్తులు కందూరి అంజయ్య గౌడ్, రంగంపల్లి రమేష్ గౌడ్, వార్డు సభ్యుడు మల్లేష్ యాదవ్, వీరేష్ గౌడ్, నరేందర్ రెడ్డి, మంగలి రమేష్, అరుణ్ కుమార్, మహమ్మద్, గంటల శంకరయ్య, పక్కనే నరేష్, గోద జంగయ్య, ఖదీర్, విగ్నేష్, బాలరాజు గౌడ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు..
