
విద్యాహక్కు చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి!!!
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో : విద్యా సంవత్సరం ప్రారంభమైన వేళ ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల మోత మోగుతోంది. యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతుండటంతో తల్లిదండ్రులపై మోయలేని భారం పడుతుంది అని, అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని నిబంధనలను ఉల్లంఘించే పాఠశాలపై గుర్తింపు రద్దు చేయాలని ఇందుకు సహకరించిన బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు -అడ్వకేట్ జగన్ మోహన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆమోదించిన ఫీజు వివరాలని నోటీసుబోర్డు పై మరియు వెబ్సైట్లలో పూర్తిగా ప్రదర్శించాలి కాని కొన్ని విద్యా సంస్థలు( కార్పొరేట్ సంస్థలు కూడా) పాటించక పోవడం దారుణం అని,పేద బలహీనవర్గాల ప్రజలపై అధికంగా అడ్డగోలుగా ఇబ్బందులు గురి చేయడం అన్యాయమని అన్నారు,నిర్మల్ జిల్లాలో కూడా కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు అదిక పీజులు వసూలు చేస్తున్నారని,పుస్తకాలు బహిరంగంగా బ్లాక్ మార్కెటింగ్ చేయడం చూస్తుంటే ప్రభుత్వం పాలన గాలికి వదిలేశారు అని జగన్ మోహన్ విమర్శించారు.భారీగా పెరుగుతున్న ఫీజులు - కొన్ని ఉదాహరణలు: హైదరాబాద్‌లో: గ్రేటర్ హైదరాబాద్ ఉప్పల్‌లోని ఒక స్కూల్లో ఫీజును రూ. 76 వేల నుండి ఏకంగా రూ. లక్షకు (40% శాతం) పెంచారు. మరో స్కూల్లో నర్సరీ ఫీజే రూ. 71,800 కాగా, పైతరగతులకు రూ. 1.25 లక్షలుగా ఉంది.ఇంటర్నేషనల్ స్కూల్స్: అంతర్జాతీయ పాఠశాలల్లో నర్సరీ ఫీజులే రూ. 2.51 లక్షలు దాటాయి. సీబీఎస్ఈ స్కూళ్లలో ఏడాదికి రూ. 2.61 లక్షల నుండి రూ. 4.91 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ స్కూల్స్: ఖమ్మంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో గత ఏడాది 8వ తరగతికి రూ. 42 వేలు ఉండగా,ఈ ఏడాది రూ. 15 వేలు పెంచి రూ. 56 వేలకు చేర్చారు. యూనిఫాం, పుస్తకాలు: ఒక పాఠశాలలో గత ఏడాది రెండు జతల యూనిఫాంకు రూ. 4,800 తీసుకోగా, ఈ ఏడాది రూ. 6,800కు పెంచారు. పుస్తకాలు, నోట్‌బుక్స్ కోసం అదనంగా రూ. 8 వేల నుండి రూ. 10 వేల వరకు వసూలు చేస్తున్నారు. పక్క రాష్ట్రాల (తమిళనాడు) ఫీజుల నియంత్రణ విధానం:తమిళనాడు ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ఒక ప్రత్యేక చట్టాన్ని అమలు చేస్తోంది అని తెలంగాణ ప్రభుత్వం కూడా అదిక పీజులు నియంత్రణ చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణలో 'ఫీజు నియంత్రణ చట్టం' ఏమైంది?రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తెస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, అదింకా అమలుకు నోచుకోలేదు ఎందుకు అని ప్రశ్నించారు,వెంటనే పీజులు నియంత్రణ చేయాలని, విద్యా హక్కు చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అడ్వకేట్ జగన్ మోహన్,చింతకుంట రాజేశ్వర్,చెరుకు రాజ్యం,లక్ష్మియాదవ్,పడిగెల రాజేష్,కాటంప్రభాకర్, క్లైమేట్ వెస్లీ,ప్యారమూర్ సాగర్,అబ్నాన్ లు పాల్గొన్నారు.