వైద్య విద్యార్థి వంశీకృష్ణకు జర్నలిస్ట్ కేపీ ఆశీస్సులు..
విద్యార్థికి దాతల సహకారంతో చదువుకు సాయం..
మర్యాదపూర్వకంగా కలిసిన వంశీకృష్ణ, అతని కుటుంబ సభ్యులు..
నువ్వు కూడా ఎదిగి చేయూతనివ్వాలి.. జర్నలిస్ట్ కేపీ
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
అంకితభావంతో చదవాలి.. అత్యున్నతికి ఎదగాలి.. సాయం పొందడం మాత్రమే కాదు.. జీవితంలో ఎదిగాక నువ్వు కూడా పదిమందికి సాయం చేయాలి.. అని జర్నలిస్ట్ కేపీ సూచించారు. ఎంబిబిఎస్ చేయడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థి వంశీకృష్ణ కు హలో షాద్ నగర్ కథనం ద్వారా వెలుగులోకి తెచ్చి దాతలు భారీ సాయం అందించేందుకు సహకరించిన జర్నలిస్టు కేపీని విద్యార్థి వంశీకృష్ణ, విద్యార్థి పెదనాన్నలు భీమయ్య, యాదమ్మ, బాబాయ్ రమేష్, గ్రామ కార్యదర్శి మహేష్, గ్రామస్తులు పట్లోళ్ల జగన్మోహన్ రెడ్డి, అప్పలరాజు, పాఠశాల హెచ్ఎం నరేష్, గ్రామస్తులు రమేష్, యాదయ్య మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తన వద్దకు నేరుగా వచ్చిన కొంత నగదును విద్యార్థికి అందజేసిన జర్నలిస్టు కేపీ అనంతరం మాట్లాడుతూ చిత్తశుద్ధితో చదివి భవిష్యత్తులో అత్యంత ఉన్నతికి ఎదగాలని ఆశీస్సులు అందించారు. ఒకరి సాయంతో చదువు వైపు సాగుతున్నట్లే భవిష్యత్తులోనూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి 10 మందికి సహకారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కె.పి సహకరించిన దాతలు అందరికీ కృతజ్ఞతలు తెలుపగా, తన కథనం ద్వారా విద్యార్థికి సాయం అందించినందుకు వంశీకృష్ణ, అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కేపీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.