పులి పిల్లను సత్కరించిన జర్నలిస్ట్ కేపీ, లక్కకాకుల రమేష్ కుమార్
ఇలాంటి ప్రతిభావంతులకు అండగా ఉంటామని హామీ
( పయనించే సూర్యుడు అక్టోబర్ 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
అతి చిన్నతనంలోనే పులి పిల్లలా అద్భుతాలు చేసి చరిత్ర సృష్టించడం మామూలు విషయం కాదని, ఇలాంటి బాలికల అవసరం దేశానికి ఎంతో ఉందని జర్నలిస్ట్ లు కెపి, లక్కాకుల రమేష్ కుమార్ అన్నారు. కొందుర్గు మండల కేంద్రానికి చెందిన జిల్లెల్ల జంగయ్య కూతురు భవ్య తేజినీ అండర్ 17 లో జరిగిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలలో రెండు బంగారు పతకాలు, ఒక వెండి పతకాన్ని సాధించిన నేపథ్యంలో బుధవారం బాలికను ఘనంగా శాలువాతో సత్కరించారు. జంగయ్య తన కూతురుతో కలిసి బుధవారం జర్నలిస్ట్ కేపీ స్వగృహానికి చేరుకుని బాలికను పరిచయం చేశారు. బాలికకు తమ ఆశీస్సులు కావాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలిక తాను ఎంచుకున్న రంగంలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగి అద్భుతాలు సృష్టించాలని ఆకాంక్షించారు. బాలికకు తామ నిరంతరం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుత తరుణంలో ఇలాంటి యుద్ధ విద్యల్లో బాలికలు ఆరితేరవలసిన అవసరం ఎంతో ఉందని వారు అభిప్రాయపడ్డారు..