
పయనించే సూర్యుడు జూన్ 11 కడప డిస్టిక్ టి సుండుపల్లి మండలం ; ఈరోజు సంబేపల్లి మండలం పి.ఎన్. కాలనీ గ్రామం, ఊటుపాలెంకు చెందిన పాల ఏకరి కులస్తుల ఆహ్వానం మేరకు టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ శ్రీ గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు (గుట్ట బాబు) అనంతపురం గంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊటుపాలెం గ్రామస్తులు శ్రీ కొండముర్ల రామచంద్రప్ప నాయుడు మరియు శ్రీ బల్లెం శ్రీరాములు నాయుడు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొని వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా శివప్రసాద్ నాయుడు మాట్లాడుతూ, అనంతపురం అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో, పాడిపంటలతో, సిరిసంపదలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పాల ఏకరి కుటుంబ సభ్యులు ఐక్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు విందు ఏర్పాటు చేయడం శుభపరిణామమని, ఇటువంటి ఆధ్యాత్మిక మరియు సాంప్రదాయ కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. ప్రజలంతా కలిసిమెలిసి ఆనందంగా జీవించాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కేసు విశ్వనాథ నాయుడు, బొమ్మి నాయుడు, రామచంద్ర నాయుడు, బల్లెం శ్రీరాములు నాయుడు, బల్లెం వెంకటేష్ నాయుడు, బల్లెం సతీష్ నాయుడు, మోటకట్ల వెంకటరమణ నాయుడు, బల్లెం వెంకటరమణ నాయుడు, ఎర్రయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, చింతమాను బ్రహ్మయ్య నాయుడు, కుడుముల రమణారెడ్డి తలుపుల మల్లి నాయుడు, బల్లెం లోకేష్ నాయుడు, కొండముర్ల సాయికుమార్ నాయుడు,తదితరులు పాల్గొన్నారు. :::