పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రవణ్ కుమార్
బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామానికి చెందిన మాల రాములు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో నాగర్ కర్నూల్ ఏరియా హాస్పిటల్ కి చికిత్స నిమిత్తమై తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు. కుటుంబ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉండడం, ఆర్థిక స్తోమత లేకపోవడంతో కుటుంబంలోని యజమాని మరణించడం తో ఏమి తోచని దీనస్థితుల్లో భార్య పిల్లలు ఎదురుచూస్తున్నా అంత్యక్రియలు జరపడానికి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి గ్రామంలోని విషయం తెలుసుకున్న మృతుని కుటుంబానికి, రేషన్ డీలర్ శెట్టి రాజేష్ కుమార్, బిఆర్ఎస్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి 5000 రూపాయల ఆర్థిక సాయం కుటుంబ సభ్యులకు అందజేశారు.గ్రామంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను పరామర్శించి సాయం చేయడంలో ముందుంటున్నారు. మరణించిన మాల రాములకు (30) భార్య ,ఇద్దరు ఆడపిల్లలు ,ఒక మగ పిల్లవాడు ఉన్నారు. ఆయన భార్య కూలి పనులు చేసుకొని జీవనం కొనసాగిస్తుంది, గత కొంతకాలంగా జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం (మాల రాములు) మరణించారు .ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను పరామర్శించి వాళ్లకు ధైర్యాన్ని ఇస్తూ వారికి ఆర్థిక భరోసా ఇవ్వడం పట్ల గ్రామంలోని స్నేహితులు ,గ్రామస్తులు. మీరు చేస్తున్న ఆర్థిక సాయం వృధా కాదని కొనియాడారు ఆపదలో ఉన్న వారికి సహాయం చేసే గుణం ఉండాలని , మంచి చేసే వారిని ప్రజలు మరువరని అన్నారు. ఈ కార్యక్రమంలో జక్కి వీరస్వామి, నాగరాజు, భాను, నరసింహ, తదితరులు పాల్గొని మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.