
పయనించే సూర్యుడు, డిసెంబర్ 09( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిబంధనలు పాటించకుండా ఆటోల ద్వారా ప్రచారం చేస్తున్న వారిపై రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో సోమవారం ఒక సర్పంచ్ అభ్యర్థి అనుమతి లేకుండానే రెండు ప్రచార ఆటోలతో గ్రామంలో మైకుల ద్వారా తమకు ఓటు వినతి చేస్తూ ప్రచారం నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా భావించిన రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ఆ రెండు ఆటోలను సీజ్ చేశారు. ఇకపై కూడా ఎలాంటి అనుమతి లేకుండా ఆటోలు, ఇతర వాహనాల ద్వారా ఏ గ్రామంలోనైనా ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని వారు స్పష్టం చేశారు.ఎన్నికల నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలని అధికారులు హెచ్చరించారు.
