
పయనించే సూర్యుడు ఆగస్టు 06 రాజాపూర్ మండలం రిపోర్టర్ నరిగె కళాశేఖర్:రాజాపూర్ మండలం రాయపల్లి గ్రామ పరిధిలోని ప్రముఖ 'అక్షయ కల్ప' డైరీ ఫామ్లో అవినాష్ క్యారియర్స్ కాంట్రాక్ట్ కింద లారీ డ్రైవర్గా పనిచేస్తున్న వలస కార్మికుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన తులసి అనే వ్యక్తి గత కొంతకాలంగా రాయపల్లిలోని అక్షయ కల్ప డైరీ ఫామ్లో అవినాష్ క్యారియర్స్ కాంట్రాక్ట్ కింద లారీ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, అనుకోని రీతిలో అతను ఫామ్ కు సంబంధించిన గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.గమనించిన తోటి సిబ్బంది వెంటనే యాజమాన్యాని కి, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు పాల్పడటానికి గల అసలు కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.