*యూరియా కోసం రైతుల తిప్పలు .
*టోకెన్ల ద్వారా రైతులకు యూరియా బస్తాల అందజేత .
*పోలీస్ భద్రత నడుమ రైతులకు యూరియా పంపిణి .
పయనించే సూర్యుడు న్యూస్ చండూరు సెప్టెంబర్ 14. చండూరు మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. పట్టణంలోని ఎరువుల షాపుల ఎదుట ఉదయం 6 గంటల నుంచే క్యూలో నిరీక్షించారు. అన్నదాతలకు రెండు బస్తాల చొప్పున ఇస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. పంటలకు సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉదయం నుంచి యూరియా కోసం పడిగాపులు కాశారు. యూరియా కోసం రైతుల ఇక్కట్లు తప్పడం లేదు. శనివారం చండూరు పట్టణంలో గ్రోమోర్ , ఆగ్రోస్, సింగిల్ విండో సొసైటీ లకు యూరియా రాగా రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. దీంతో రైతులు ఆధార్ కార్డుతో టోకన్స్ తీసుకుని యూరియా బస్తాల తీసుకునేందుకు క్యూలైనులో నిలబడ్డారు. శనివారం ఉదయం ఒక్కసారిగా పెద్దఎత్తున రైతులు రావడంతో అక్కడ రద్దీ నెలకుంది. ఏఈవో వచ్చి టోకెన్ల ద్వారా రైతులకు యూరియా బస్తాలను అందజేశారు. పోలీస్ భద్రత నడుమ రైతులకు పాసుపుస్తకానికి రెండు బస్తాల చొప్పున విక్రయించారు. రైతులకు పూర్తిస్థాయిలో యూరియా అందకపోవడంతో ఆందోళన చెందారు.గంటల తరబడి క్యూలో నిరీక్షించినా తమకు సరిపడా యూరియా అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కా ర్ యూరియా సరఫరాలో విఫలమైందని మండిపడ్డారు.