
పయనించే సూర్యుడు నవంబర్ 5(పొనకంటి ఉపేందర్ రావు)
ఇల్లందు :ఆంధ్ర ప్రదేశ్ కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఇల్లందు ఎమ్మెల్యే దంపతులుకోరం కనకయ్య శ్రీమతి లక్ష్మీ వారితో పాటు మడుగు సాంబమూర్తి, బొల్లా సూర్యం,చిల్లా శ్రీనివాస్, గంధ సదానందం, చిట్టి బాబు. కార్తీక పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు, అనంతరం గర్భాలయంలో ఉన్న స్వామి వారిని వారంతా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి,తీర్థప్రసాదాలు స్వీకరించారు.