
ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేవైఎం రాష్ట్ర అదనపు కార్యదర్శి వంశీకృష్ణ
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్నారం పోలింగ్ బూత్ (193) లో బూత్ అధ్యక్షుడు బొక్క కృష్ణయ్య ఏర్పాటు చేసిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ వంశీకృష్ణ మాట్లాడుతూ… ముందుగా భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు 46వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనమందరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అయినందుకు గర్వించాలి అని అన్నారు, మరియు పార్టీ ఏ ఆశయాలతో సిద్ధాంతాలతో ఆనాడు శ్యామాప్రసాద్ ముఖర్జీ స్థాపించారో ఆ ఆశయాల కోసం మనం ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పార్టీకి పనిచేయాలని పిలుపునిచ్చారు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని అన్నారు,అలాగే ప్రతి సామాన్య కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు అయ్యేటటు వంటి పార్టీ ఇది ఒకటే పార్టీ ఉందని చెప్పారు, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సామాన్య ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందు దేశం తర్వాత పార్టీ చివరికి నేను అన్న ఆలోచనతో పార్టీ పనిచేస్తుందని తెలిపారు, దేశసేవ త్యాగం నిబద్ధతకు నిలువుటద్దం భారతీయ జనతా పార్టీ అని అన్నారు, గత 2014 నుండి ఇప్పటివరకు దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతూ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న మన ప్రధానమంత్రిగారిని మనం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు, మన భారతదేశం వైపు ఈరోజు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి అంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీయే, అందుకోసం మన గ్రామంలో మరియు మన నియోజకవర్గంలో మన తెలంగాణ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మనం అహర్నిశలు కష్టపడి పార్టీని పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే కాలంలో తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయడానికి ప్రతీ కార్యకర్త సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇన్చార్జి ఎస్సీ మోర్చా రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎస్ శివశంకర్ , ఎస్టి మోర్చా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జె వినోద్ నాయక్ , జిల్లా నాయకులు రొడ్డ ప్రశాంత్ గౌడ్, సీనియర్ నాయకులు బొక్క శ్రీను , జె. సురేష్ నాయక్ ,కృష్ణాజి , చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.