
మొక్కలు నాటిన సర్పంచ్ లావణ్య రామకృష్ణ
( పయనించే సూర్యుడు ఆగస్టు 05షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో మంగళవారం రోజు సర్పంచ్ లావణ్య రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా వనమావోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల మొక్కలను గ్రామస్తులతో కలిసి సర్పంచ్ లావణ్య రామక్రిష్ణ నాటడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య రామకృష్ణ తో పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ మరియు ఉప సర్పంచ్ ఒగ్గుల శివశంకర్, పరమేష్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.